NTV Telugu Site icon

AP Capital: ఏపీ రాజధానిగా వైజాగ్!.. సీఎం జగన్‌ సంచలన ప్రకటన

Visakha

Visakha

CM YS Jagan Says AP Capital is Vizag: ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు. విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజన్‌లా మారుస్తామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని.. వైజాగ్‌లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్‌ నిర్మిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

విశాఖలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ డెవలప్‌ మెంట్ డైలాగ్ సదస్సులో సీఎం జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 90 శాతం హైదరాబాద్‌కే పరిమితమయ్యాయన్నారు. అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్‌ను రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ర్ట జీఎస్‌డీపీలో సర్వీస్ సెక్టార్ తెలంగాణలో 62 శాతం ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌లో 40 శాతం మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయం కూడా తెలంగాణ లో 3.12 లక్షలు ఉంటే ఏపీ లో 2.9 లక్షలు మాత్రమే ఉందన్నారు. సుదూర సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామన్నారు.

Read Also: Gummanuru Jayaram: వైసీపీకి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా

రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, మూల పాడు పోర్టులు అత్యంత వేగంతో నిర్మాణం అవుతూ ఉన్నాయన్నారు. బ్లూ ఎకానమీని పెంచే క్రమంలో 10 ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం జరుగుతోందన్నారు. సర్వీస్ సెక్టార్‌ను విస్తృతం చేయడమే విజన్ విశాఖ లక్ష్యమన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కడప, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు అవుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ 1లో ఉన్నామన్నారు. గత మార్చిలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో 13 లక్షల కోట్ల విలువ చేసే 360 ఎంఓయూలలో 39 శాతం ఎంఓయూలు గ్రౌండ్ అయ్యాయన్నారు. అధికారంలోకి వచ్చాక 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని సీఎం చెప్పారు. పెద్ద పరిశ్రమలు 3, 4 లక్షల ఉద్యోగాలు అందిస్తే ఎంఎస్ఎంఈలు 30 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయన్నారు. 1.5 కోట్ల మహిళలు స్వయం ఉపాధిని సాధించారన్నారు. రాష్ర్ట అభివృద్ధిని కోరుకోని ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో వుంది…ఇది దురదృష్టకరమన్నారు. విశాఖ నుంచి పరిపాలనను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వుంటే నగరం అభివృద్ధి బహుముఖంగా జరుగుతుందన్నారు. నాకు ఏమీ వ్యక్తిగత ఆలోచనలు, ప్రయోజనాలు లేవు….రాష్ర్ట అభివృద్ధి ఒక్కటే లక్ష్యమన్నారు. బెంగలూరు, చెన్నై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం వైజాగ్‌కు వుందన్నారు.

 

Show comments