NTV Telugu Site icon

Memantha Siddham Bus Yatra: నేటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.

Cm Jagan

Cm Jagan

Memantha Siddham Bus Yatra: వై నాట్ 175 టార్గెట్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్‌. రేపు(ఏప్రిల్‌ 25) పులివెందులలో నామినేషన్‌ వేస్తారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే.. మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.

Read Also: CM Vijayan: దేశంలో కీలక పరిణామాలు ఉన్నప్పుడే రాహుల్ గాంధీ కనిపించరు.. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. నేడు శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఈరోజుకు జగన్ బస్సు యాత్ర 22వ రోజుకు చేరుకుంది. రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రోడ్ షో ద్వారా ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్న పేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరుశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుంటారు. టెక్కలిలో బహిరంగ సభ… అక్కడ భోజన విరామానికి ఆగుతారు. అనంతరం కె. కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకుని అక్కడి జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. దీంతో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిస్తుంది. అనంతరం హెలిప్యాడ్‌ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుని.. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకోనున్నారు. రేపు ఏఫ్రిల్ 25న పులివెందుల అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తారు సీఎం వైఎస్ జగన్‌. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనో అంతకుమించి అన్నట్టు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళిక సిద్ధం చేశారు ముఖ్యమంత్రి జగన్‌. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా సీఎం జగన్‌ ప్రచార షెడ్యూల్‌ సిద్ధమవుతోంది.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. సభలూ, వివిధ వర్గాలతో ముఖాముఖీలు, రోడ్‌ షోలు, జనానికి ఆత్మీయ పలకరింపులతో ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర సాగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మండుటెండలోనూ సీఎం జగన్‌కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఇప్పటివరకు 21 రోజుల పాటు 22 జిల్లాల్లో సాగిన బస్సు యాత్రలో 15 భారీ బహిరంగ సభల్లో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగించారు.