Varikapudisela Irrigation Project: పల్నాడు రూపురేఖలను మార్చే దిశగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి పల్నాడు జిల్లా మాచర్లకు చేరుకున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు జిల్లా ఉన్నతాధకారులు, ప్రజా ప్రతినిధులు.. ఆ తర్వాత వరికిపూడిసెల ప్రాజెక్ట్ నమూనా పరిశీలించిన సీఎం జగన్.. అనంతరం రూ.340.26 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వరికిపూడిసెల ఎత్తి పోతల పథకం మొదటి విడత పనులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.. ఆ తర్వాత చెన్నకేశవ కాలనీ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు..
Read Also: Kanguva: ఆరు ఫైట్స్… అందులో ఒకటి అండర్ వాటర్ ఎపిసోడ్
కాగా, పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెవరేర్చేందుకు పూనుకున్నారు సీఎం జగన్.. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు లభించడంతో.. ఈ రోజు పనులను ప్రారంభించారు.. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలోని 24,900 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.. అంతేకాకుండా 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.. ఇక, ఏపీలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ కూడా ఇదే కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.