CM YS Jagan: పారిశ్రామిక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పలు పరిశ్రమలు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. కలెక్టర్లు కూడా ఈవిషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని స్పష్టం చేశారు. 386 ఎంవోయూలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో చేసుకున్నాం.. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నాం. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నాం అని వెల్లడించారు. ఇవన్నీ నెలకొల్పేలా ప్రతినెలా సమీక్ష చేస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నాం.. 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయి. 94 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు సీఎం జగన్.
Read Also: Karnataka: ఉద్యోగం పేరుతో మోసాలు.. ఆంధ్రా మూలాలున్నయువకులే టార్గెట్..
నెలకు కనీసం రెండు సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి.. ప్రతి అడుగులోనూ కలెక్టర్లు చేయి పట్టి నడిపించాలని సూచించారు సీఎం జగన్.. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. 69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఎప్పుడూ చూడని అడుగులు వేశాం. కోవిడ్ సమయంలోకూడా కుప్పకూలిపోకుండా చేయూత నిచ్చాం అని తెలిపారు. 1.88 లక్షల ఎంఎస్‌ఎంఈలు కొత్తగా వచ్చాయి. 12.62 లక్షల ఉద్యోగాలు వీటిద్వారా వచ్చాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఫోన్‌కాల్ దూరంలో ఉన్నాం అని స్పష్టం చేశారు. 9 ప్రాజెక్టుల్లో 3 ప్రారంభిస్తున్నాం, మిగతా ఆరు పనులు ప్రారంభిస్తున్నాం.. దాదాపు 1100 కోట్ల పెట్టుబడి, 21 వేలమందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందన్నారు.
Read Also: Malavika Mohanan: నాజూకు అందాలతో మదిని దోచుకుంటున్న.. మాళవిక మోహనన్
పత్తికొండకు నేను వెళ్లినప్పుడు అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పాం.. ఈ మేరకు ఇవాళ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం అని ఈ సందర్భంగా వెల్లడించారు సీఎం జగన్.. అధికారులు మంచి కృషి చేశారు.. అంతే వేగంగా అడుగులు ముందుకేయాలన్న ఆయన.. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నవారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు.. ఎంఎస్‌ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్‌లు అందించనున్నాం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.