NTV Telugu Site icon

CM YS Jagan: రాజధానిపై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం.. దసరా విశాఖలోనే..

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ సచివాయలంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది.. కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది.. అయితే, కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం జగన్‌.. కీలక వ్యాఖ్యలు చేశారు.. దసరా పండుగ విశాఖలోనే అని స్పష్టం చేశారు. దీంతో.. గత కొంత కాలంగా విశాఖ కేంద్రంగా పాలన ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే చర్చకు బ్రేక్‌ పడినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు త్వరలోనే.. సెప్టెంబర్‌లో.. అక్టోబర్‌లో ఇలా విశాఖ కేంద్రం పరిపాలనపై చెబుతూ వస్తున్నారు మంత్రలు.. అయితే, ఈ రోజు మాత్రం క్లారిటీ ఇచ్చేశారు సీఎం జగన్‌.. దసరా పండుగ విశాఖలోనే జరుపుకుంటామని పేర్కొన్నారంటే.. దసరా లోనే రాజధానిని విశాఖకు తరలించనున్నారన్నమాట. ఇక, విశాఖలో కార్యాలయాల నిర్ధారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.

మరోవైపు వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌పై స్పందించిన సీఎం జగన్‌.. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌పై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచిచూద్దాం.. కానీ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు సీఎం జగన్‌.. ఇక, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై కూడా స్పందించారు సీఎం.. అవసరమైతే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అవినీతి స్కాంలపై చర్చిద్దామని సూచించారట.. అసెంబ్లీ సమావేశాలను అందరూ సీరియస్ గా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉండగా.. అమరావతి రింగ్‌ రోడ్డు, ఏపీ ఫైబర్‌ నెట్.. ఇలా వరుసగా ఏసీబీ కోర్టులో సీఐడీ.. పీటీ వారెంట్‌లు నమోదు చేస్తున్న విషయం విదితమే.

కాగా, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలుకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్‌.. దీనికి సంబంధించిన బిల్లుపైచర్చించి ఆమోదం తెలిపింది.. రేపు అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. ఇక, మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉద్యోగి రిటైర్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్న ఆయన.. రిటైర్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలని ఆదేశించారు. రిటైర్‌ అయిన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద కూడా ప్రయోజనాలు అందేలా చూడాలని.. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

Show comments