CM YS Jagan: ఇక మనం గేర్ మార్చాలి.. ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇకపై మరొక ఎత్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఇక మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చింది.. ఇప్పటివరకూ మనంచేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. ఇకపై చేసే కార్యక్రమాలు మరొక ఎత్తు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన.. జగనన్న ఆరోగ్యసురక్ష, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? పేరుతో ప్రభుత్వ అభివృద్ధికార్యక్రమాలపై నెలరోజులపాటు ప్రచారంపై చర్చించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయం అన్నారు.. 175 కి 175 వైనాట్.. ఇది పాజిబుల్ కాబట్టే… క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులున్నాయన్నారు. అందుకే ఒంటిరిగా పోటీకి రాకుండా ప్రతిపక్షపార్టీలు పొత్తులకు వెళ్తున్నాయని దుయ్యబట్టారు.
గడపగడపకూ కార్యక్రమంలో మన పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశారు.. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్మం, ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకు వేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.. ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ ఉండడం ముఖ్యమైన విషయంకాగా, ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహాలు మరొక ముఖ్యమైన అంశం అన్నారు.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి.. విభేదాలను పరిష్కరించుకోవాలి. వచ్చే 6 నెలల్లో వీటిపై దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. మనం అంతా ఒక కుటుంబంలో సభ్యులమే.. చాలామందికి టిక్కెట్లు రావొచ్చు, మరికొంతమందికి ఇవ్వలేకపోవచ్చు.. ప్రజల్లో.. ఎవరికి ఇస్తే కరెక్టు అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చు.. టిక్కెట్టు ఇవ్వనంత మాత్రాన.. ఆ వ్యక్తి మన మనిషి కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు సీఎం జగన్.
Also Read
- Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
- DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
టిక్కెట్లు ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండాపోరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.. జుట్టు ఉంటే.. ముడేసుకోవచ్చు అని ఇదివరకే చెప్పాను.. టిక్కెట్లు ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరూ నా నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలి.. టిక్కెట్లు ఇవ్వని పక్షంలో మరొకటి ఇస్తాం.. లీడర్‌మీద, పార్టీ మీద నమ్మకం ఉంచాలన్నారు. సర్వేలుకూడా తుది దశలోకి వస్తున్నాయి.. చివరి దశ సర్వేలు కూడా జరుగుతుంటాయి.. ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే.. అంత మంచి ఫలితాలు మీ పట్ల వస్తాయి.. అందుకనే ప్రజల్లో మమేకమై ఉండాలని సూచించారు. వచ్చే 2 నెలలకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలను మీకు తెలియజేస్తున్నాను.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, అలాగే వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని పార్టీ నుంచి చేపడుతున్నాం.. వచ్చే 2 నెలల్లో ఈ రెండు కార్యక్రమాలు చేపడతాం అన్నారు.
గతంలో చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్ వచ్చింది.. దాదాపు 98 లక్ష సర్టిఫికెట్లు ఇచ్చాం.. అర్హులైవానికి అవసరమైన ధృవపత్రాలను జారీచేశాం.. దీనిలాగే ఆరోగ్య సురక్ష చేపడుతున్నాం అన్నారు వైఎస్ జగన్.. ఆరోగ్య పరంగా ప్రతి ఇంటినీ జల్లెడపడతాం.. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తాం.. గుర్తించిన వారికి చేయూతనిచ్చి వారికి మెరుగైన చికిత్సలు అందిస్తాం.. నయం అయ్యేంతవరకూ విలేజ్ క్లినక్, ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్‌తో వారికి చేయూతనిస్తాం.. ఇందులో ప్రజా ప్రతినిధులను, పార్టీ శ్రేణులను మమేకం చేస్తాం అన్నారు. మొత్తం 5 దశల్లో జగనన్న సురక్షకార్యక్రమం జరుగుతుంది.. మొదటి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి, ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు.. రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు ప్రతి ఇంటికీ వెళ్లి పరీక్షలు చేయడానికి వెళ్తారు. ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పిస్తారని.. మూడో దశలో వాలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపు ఏర్పాటు, తేదీ, వివరాలు తెలియజేస్తారని.. నాలుగో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు.. ఐదో దశలో అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి వారికి నయం అయ్యేంతవరకూ చేయూత నిస్తారని వివరించారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
తాజావార్తలు
-
Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!