NTV Telugu Site icon

CM YS Jagan: అమర్నాథ్‌ నాకు మరో తమ్ముడు.. గుండెల్లో పెట్టుకుంటా..

Ap Cm

Ap Cm

CM YS Jagan: మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బటన్‌ నొక్కి వైఎస్సార్ చేయూత సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.. ఇక, అమర్నాథ్‌, భరత్‌పై కీలక కామెంట్లు చేశారు.. కుడి, ఎడమ అమర్నాథ్, భరత్ వున్నారు ఇద్దరు తమ్ముళ్లు… అమర్నాథ్ కు భవిష్యత్ లో చాలా మంచి జరుగు తుంది.. నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నారు. భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు.

Read Also: PM Modi : ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి శ్రీనగర్ చేరుకున్న ప్రధాని మోడీ

మొత్తంగా పిసినికాడ సభలో మంత్రి అమర్నాథ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌.. పూర్తిస్థాయిలో పార్టీకి అమర్నాథ్ సేవలు ఉపయోగించుకుంటామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలపగా.. 15 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని సీఎం సమక్షంలో ప్రకటించారు అమర్నాథ్.. వైఎస్‌ జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తన లక్ష్యం అన్నారు. డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా అధిష్ఠానం పెద్ద బాధ్యత పెట్టిందన్నారు. దేవుడు అందరి తలరాతలు రాస్తే.. వైఎస్‌ జగన్ నా తలరాత రాస్తాడు.. వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ స్థానంలో అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న భరత్ ను గెలిపించాలని కోరారు.. అమర్నాథ్‌కు మంచి భవిష్య త్ వుంటుంది.. గుండెల్లో పెట్టుకుంటాను అని హామీ ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..