NTV Telugu Site icon

CM YS Jagan: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌.. సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయని విమర్శించిన ఆయన.. ప్రభుత్వ సొమ్మ 371 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఫైర్‌ అయ్యారు.. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలని పేర్కొన్నారు.. ప్రభుత్వ రంగంలో స్కిల్‌ కాలేజీలు, ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో మంచి వ్యవస్థలు ఏర్పడతాయని వెల్లడించారు.. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

కాగా, దేశచరిత్రలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ అతి పెద్దదని గతంలో ఆరోపించారు సీఎం వైఎస్‌ జగన్‌.. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోందన్న ఆయన.. ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్‌గా చెప్పుకొచ్చారు. విదేశీ లాటరీ తరహాలోనే ఈ స్కిల్‌ స్కామ్‌ను నడిపించారని ఆరోపించారు. దీంతో 371 కోట్ల రూపాయల జనం సొమ్మును మాయం చేశారని.. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కీమ్‌ ఖర్చు మొత్తం 3 వేల 356 కోట్లు అని తెలిపారు.. ఇందులో ప్రభుత్వం వాటా 10శాతం కాగా.. 90శాతం సీమెన్స్ కంపెనీ భరిస్తుందని చెప్పారన్నారు. అయితే, ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీ 3 వేల కోట్ల రూపాయలను గ్రాంట్‌గా ఇస్తుందా? అని గతంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబును సీఎం జగన్‌ నిలదీసిన విషయం విదితమే.