Site icon NTV Telugu

Veligonda Project: ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. నాడు నాన్న.. నేడు కొడుకు..

Veligonda 2

Veligonda 2

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పైలాన్‌ను ఆవిష్కరించి.. ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి.. వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల కలలు కన్న వెలిగొండ ప్రాజెక్టు సాకారం చేసుకున్నాం.. ప్రాజెక్టు ప్రారంభించే అవకాశాన్ని దేవుడు నాకివ్వటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు వైఎస్సార్ శంఖుస్థాపన చేసి పనులు మొదలు పెడితే.. ఇవాళ ఆయన కొడుకుగా రెండు టన్నెల్స్ ను ప్రారంభించటం దేవుడి రాసిన స్క్రిప్ట్ అని భావిస్తున్నాను అన్నారు..

Read Also: Veligonda project: వెలిగొండ ప్రాజెక్ట్‌ జాతికి అంకితం.. సీఎం సంతోషం

మొదటి సొరంగం పనులు 2021 లో పూర్తవ్వగా.. కొద్దిరోజుల క్రితం రెండవ టన్నెల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు సీఎం జగన్.. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు 4.45 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.5 లక్షల మందికి త్రాగునీరు అవసరాలు తీరతాయన్నారు. జులై, ఆగస్టు కల్లా నల్లమల సాగర్ ప్రాజెక్టు నీటితో నిండుతుంది.. శ్రీశైలంలో 840 అడుగుల నీటి మట్టం దాటగానే రోజుకు ఒక్క టీఎంసీ నీరు తెచ్చే అవకాశం లభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు నీళ్లు నింపే సమయానికి పెండింగ్ లో ఉన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తి చేస్తాం.. మళ్లీ మనం అధికారంలోకి వచ్చాక ప్రమాణ స్వీకారం చేశాక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తి చేసి నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: Nayak Rereleasing: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా “నాయక్” రీ రిలీజ్

ఇక, ప్రాజెక్టు పూర్తయితే ఫ్లోరైడ్ ప్రభావం తగ్గుతుందని తెలిసి కూడా గత ప్రభుత్వ హయాంలో నత్త నడకన పనులు జరిగాయని దుయ్యబట్టారు సీఎం వైఎస్ జగన్.. రెండు టన్నెల్స్ 18.8 కిలోమీటర్లు చొప్పున ఉంటే వైఎస్ హయాంలో ఉరుకులు, పరుగులతో పనులు జరిగాయి.. గత టీడీపీ హయాంలో 6.2 కిలోమీటర్ల పనులు మాత్రమే జరిగాయని విమర్శించారు. అయితే, మన ప్రభుత్వం వచ్చాక 11.2 కిలోమీటర్ల పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేశామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతమంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన్న ఆయన.. త్వరలో ఎన్నికలు రానున్నాయి.. యర్రగొండపాలెం అభ్యర్ధి చంద్ర శేఖర్ ను.. ఒంగోలు ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version