NTV Telugu Site icon

CM YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపే..

Jagan

Jagan

CM YS Jagan: ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపే అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. భీమవరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భీమవరంలో ఉప్పొంగిన ప్రజల అభిమానం సముద్రం కనిపిస్తోంది.. ఇంతటి అభిమానాలు, ఆప్యాయత చూపిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిరు. మంచి చేసి మనం.. జెండాలు జతకట్టి వాళ్లు వస్తున్నారు.. పేదల వ్యతిరేకులు ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధి సంక్షేమాన్ని కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమా..? అని ప్రశ్నించారు. జరగబోయేవి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు మాత్రమే కాదు.. వచ్చే ఎన్నికల్లో మన ఓటు ఐదేళ్ల భవిష్యత్తు. పేదల సంక్షేమం అన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందు వేయాలా లేక మోసపోయి మళ్లీ నష్టపోవాలా అనేది నిర్ణయించే ఎన్నికలు ఇవి… ఈ ఎన్నికలు మన తలరాతను మార్చే ఎన్నికలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు.

Read Also: KKR vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

ఇక, జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు.. పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు సీఎం జగన్‌.. ఎన్నికల్లో జగన్ పేదల పక్షం.. రాబోయే ఐదేళ్లలో మీరు ఏ దారిలో నడవాలని ఎన్నికల నిర్ణయిస్తాయన్న ఆయన.. కుటుంబ అంతా కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోమని కోరారు.. జగన్‌కు ఓటేస్తే ఈ మంచి అంతా కొనసాగుతుంది.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతాం అనేది చరిత్ర చెబుతున్న సత్యం.. అందుకే బాగా ఆలోచించి ఓటు వేయండి.. వేసే ఓటు వల్ల మనకి మంచి జరుగుతదా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించి అడుగులు ముందుకు వేయాలన్నారు. చంద్రబాబుకు ఈ మధ్య నాపై కోపం ఎక్కువ వస్తోంది.. హై బీపీ వస్తుంది.. ఏవేవో తిడుతూ శాపనార్థాలు పెడుతున్నారు.. రాళ్లు వేయండి అంతం చేయండి అంటూ చంద్రబాబు పిలిపు ఇస్తున్నారు.. నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకంటే.. ఎందుకంటే చంద్రబాబును నేను అడగకూడని ప్రశ్న అడిగా.. ఆ ప్రశ్న ఏంటంటే బాబు బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురుచూస్తూ ఇంకోపక్క జపం చేస్తున్నట్టుగా నటిస్తావెందుకని అడిగా.. ఇలా అడగడం తప్పా..? మీ పేరు చెబితే పేదలకు గుర్తొచ్చే పథకం ఒకటైన ఉందా అని చంద్రబాబును అడిగా.. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా బాబు పేరు చెబితే వెన్నుపోట్లు మోసం దగా అబద్ధాలు కుట్రలు ఇవి మాత్రమే గుర్తొస్తున్నాయని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్‌ జగన్‌.