CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో నామపత్రాల స్వీకరణ ముగియడంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అధికార వైసీపీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 22 రోజుల పాటు 23 జిల్లాలు 86 నియోజకవర్గాల్లో చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రను బుధవారంతో ముగించారు. గురువారం పులివెందులలో నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో జైత్ర యాత్రకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28(రేపటి) నుంచి రోజుకు మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Read Also: YSRCP: టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో వై ఎస్సార్ సర్కిల్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్‌లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 29న చోడవరం,పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్
*28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు
*29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు
*30న కొండేపి, మైదుకూరు, పీలేరు
*మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు