CM YS Jagan Delhi Tour: సీఎం జగన్ బిజీ బిజీ.. మరోసారి ఢిల్లీ బాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Delhi Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్‌రెడ్డి వరుస పర్యటనలతో ఈ వారం అంతా బిజీగా ఉండనున్నారు. మంగళవారం చిత్తూరులో పర్యటిస్తారు. విజయా డైరీ పునరుద్ధరణలో భాగంగా.. అమూల్ సంస్థ ఏర్పాటుచేసే కొత్త యూనిట్‌కు భూమి పూజ చేస్తారు. క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం చేరుకుని.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరతారు. ఈ నెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉంటారు. 5వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. విభజన చట్టం హామీల అమలు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపనున్నారు. 6న ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకుంటారు.
Read Also: PM Narendra Modi: కేంద్ర కేబినెట్‌లో కీలక చర్చ.. మంత్రివర్గ విస్తరణపై సిగ్నల్స్..?
Also Read
- Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. "జాఫర్ ఎక్స్‌ప్రెస్"నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
- Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
- Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
మరోవైపు.. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం జగన్.. కడప జిల్లాలో పర్యటిస్తారు. సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. జులై8న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో ఇడుపులపాయ వెళ్తారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని నిర్వహించనుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించనున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. వాతావరణ బీమా, ఫసల్ బీమా నిధులను రైతుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనల నేపథ్యంలో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లలో అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు.
తాజావార్తలు
-
Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్‌ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
-
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
-
West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?