NTV Telugu Site icon

CM YS Jagan: ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున బాబుకు ఓటేస్తే..!

Jagan

Jagan

CM YS Jagan: ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామన్నారు. అయితే, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అయిపోతాయి.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ చేశాం.. వివిధ పథకాల ద్వారా 2,70 వేల కోట్లు నేరుగా 130 సార్లు బటన్ నొక్కి నేరుగా అకౌంట్ లో వేశాం.. గతంలో ఎప్పుడైనా ఇలా నేరుగా అకౌంట్‌లో డబ్బులు వేశారా? అని నిలదీశారు.

Read Also: Lords Cricket Stadium: లార్ట్స్ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ పెంపు..

అమ్మ ఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తాం.. ఈబీసీ నేస్తాం.. విద్యా దీవెనతో లాంటి పథకాలు అందిస్తున్నాం అని గుర్తుచేశారు సీఎం జగన్‌.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెళ్ళుకు అండగా నిలిచాం.. ఇంటి వద్దకే పెన్షన్.. రేషన్, పథకాలు ఇచ్చిన ఘనత నాదన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంటికి పెన్షన్ వచ్చిందా..? పథకాలు వచ్చాయా..? అని ప్రశ్నించారు. అయితే, దేవుడు దయతో పేదాలందరికి మంచి చేశాను అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తు వస్తుందా? అని మరోసారి నిలదీశారు. ఏ పేదవాడికైనా ఒక్క మంచి పని చేశాడా..? చంద్రబాబుఅధికారంలోకి వస్తే మోసాలు చేశాడు..? గత ఎన్నికల ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశాడా..? చంద్రబాబు లాంటి మోసాగాడిని నమ్మాచ్చా…? ఇంటికి కేజీ బంగారు, బెంజ్ కారు ఇస్తానని చెబుతాడు.. నమ్ముతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మళ్లీ మేనిఫెస్టోతో మోసం చేయాలి చూస్తున్నాడు అని ఆరోపించారు. మళ్లీ వాలంటీకంలె ఇంటికి రావాలన్నా.. పెన్షన్ రావాలన్న.. బటన్‌లు నొక్కాలన్నా.. సీఎంగా మళ్లీ జగనే రావాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.