CM YS Jagan: ఈ ఎన్నికల్లో విశ్వసనీయతకు.. వంచనకు మధ్య యుద్ధం నడుస్తోంది.. మీకు మంచి జరగాలంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు.. అవతలి పక్షం తోడేళ్లుగా మోసగాళ్లుగా వస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్నారు. ఒంటరిగా ఎన్నికలము ఎదుర్కొలేక కూటమిగా వస్తున్నారు.. చంద్రబాబు.. దత్త పుత్రుడు వీరికి తోడు బీజేపీని కూడా కలుపుకున్నారు.. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలని కోరారు సీఎం వైఎస్ జగన్.
Read Also: IPL 2024: సన్రైజర్స్ అభిమానులకు భారీ షాక్.. ఈ సీజన్ మొత్తం స్టార్ ప్లేయర్ దూరం..!
చంద్రబాబు హయాంలో పేదలకు మంచి జరగలేదన్నారు జగన్.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చెప్పుకునేందుకు ఏమీ లేదు.. రంగు రంగుల మేనిఫెస్టో తెచ్చారు.. కానీ, అందులోని హామీలను నెరవేర్చామని చెప్పుకోలేడు.. ఎన్నికల ముందు మేనిఫెస్టో చూపుతారు.. అనంతరం అది కనపడదు.. మేనిఫెస్టోలో 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టో చూపించాలంటే చంద్రబాబు భయపడతారని దుయ్యబట్టారు. లంచాలు లేని వ్యవస్థను.. వివక్ష లేని పాలనను తీసుకువచ్చాం.. సామాజిక న్యాయనికి అర్థం చెప్పాను.. అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు సంక్షేమం అందించాం.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మేం చేసిన దాంట్లో కనీసం 10 శాతమైనా అయినా చేశారా? అని నిలదీశారు.
Read Also: Siddaramaiah: మోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేయండి.. ఓటర్లను కోరిన సీఎం..
ప్రతీ గ్రామానికి ఏడు వ్యవస్థలను తీసుకువచ్చాం.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు సీఎం జగన్.. వాలంటీర్, రైతు భరోసా కేంద్రం.. విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ.. ఇంగ్లీష్ మీడియం స్కూల్.. మహిళా పోలీస్.. అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశా యాప్.. వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ చూసినా ఉంది.. అందుకే ధైర్యంగా అన్ని చేశాను అని చెబుతున్నాను అన్నారు. ప్రతి కుటుంబానికి మంచి చేశాను కాబట్టి ధైర్యంగా చెబుతున్నా.. ప్రతి కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే నాకు మద్దతు ఇమ్మని కోరుతున్నా.. ఈ మంచి మరో ఐదేళ్ల పాటు కొనసాగాలంటే ఓటు ద్వారా మద్దతు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ ఓటుతో ప్రజల తలరాతలు మారుతాయి.. కుటుంబ సభ్యులతో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయానికి రండి. ఎవరి వల్ల మేలు జరిగిందనే విషయాన్ని లోతుగా ఆలోచించండి.. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఇంటింటికి వెళ్లి చెప్పండి అని పిలుపునిచ్చారు.
