NTV Telugu Site icon

Jagananna Vidya Kanuka: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కూళ్లు తెరిచిన రోజే విద్యాకానుక..

Ys Jagan

Ys Jagan

Jagananna Vidya Kanuka: విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. స్కూళ్లు జూన్‌ 12న తిరిగి తెరుస్తారు.. అయితే, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్ళల్లో నాడు – నేడుకు సరిపడా నిధులు ఉన్నాయన్నారు.. తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లు ఉన్నాయని తెలిపిన ఆయన.. తదుపరి ఖర్చుల కోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఐఎఫ్‌పీ పానెళ్లు బిగించడం పూర్తి కావడంతో 15వేలకు పైగా స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు – నేడు పనులు పూర్తయినట్టే అని వెల్లడించారు.

Read Also: TS Congress: అధికారం కోసం టీ.కాంగ్రెస్ అదిరిపోయే స్కెచ్

ఇక, పాఠశాలల్లో డిజిటిలీకరణ కూడా పూర్తవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్‌.. జూన్‌ 12 లోగా ఈ ఐఎఫ్‌ఎప్‌ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేసిన ఆయన.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లు స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబ్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తారని వెల్లడించారు.. నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్‌ డేగా పరిగణించాలని సూచించారు.. స్కూళ్లు జూన్‌ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని.. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదని.. దాదాపు 43.01 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..