NTV Telugu Site icon

CM YS Jagan: మరో 70 రోజుల్లోనే ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం..

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగబోతోఉన్నాయి.. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోన్న తరుణంలో.. మరో 70 రోజుల్లోనే ఎన్నికలు వస్తాయని క్లారిటీ ఇచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. భీమిలి సంగివలసలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం జగన్‌.. ‘సిద్ధం’పేరుతో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది.. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవసైన్యం కనిపిస్తోందన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం.. ఇప్పటి వరకు 99 శాతం హామీలు నెరవేర్చాం.. 175 స్థానాలకు 175 సీట్లు గెలుపే మన టార్గెట్‌.. చంద్రబాబుతో సహా అందర్ని ఓడించాల్సిందే అని పిలుపునిచ్చారు.. మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపిస్తాయి.. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు.. ఒంటరిగా పోటీ చేయలేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు అని దుయ్యబట్టారు.

Read Also: Thyroid Control: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఇది మీకోసమే..

అబద్ధానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోంది.. మోసం, విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతుందన్నారు సీఎం జగన్‌.. ఈ 56 నెలల్లో రాష్ట్రంలోని గ్రామాల్లో వచ్చిన ఎన్నో మార్పులు కనిపిస్తాయి.. లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చామని తెలిపారు. కానీ, చంద్రబాబు పాలనలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చేసింది ఏదైనా ఉందా? చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏముంది? చంద్రబాబు తీసుకొచ్చిన మార్పు ఏముంది? 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు మార్క్‌ ఎక్కడ ఉంది? అని నిలదీశారు. ఎక్కడ చూసినా కనిపించేది జగన్‌, వైసీపీ మార్కే అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Raviteja: కోతి ‘కోటి’ హీరోగా సినిమా.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి రవితేజ

పేద సామాజిక వర్గాల మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే సగం నామినేటెడ్‌ పదవులు వాళ్లకే ఇచ్చాం అన్నారు సీఎం జగన్‌.. కేబినెట్‌ 68 శాతం మంత్రి పదవులు బలహీన వర్గాలకు ఇచ్చాం.. పేద కులాల వారిని నలుగురిని డిప్యూటీ సీఎంలుగా చేశాం.. ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చాం అని వెల్లడించారు. పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపడంలో చంద్రబాబు మార్క్‌ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా..? పేద వర్గాలు కనిపిస్తే.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలా అంటాడు.. ఇటువంటి మాటలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే గ్రామాల్లో ఉన్న ఎస్సీలు ఎవరైనా పట్టించుకుంటారా? బీసీలు తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్‌ అంటాడు చంద్రబాబు.. అలా చేస్తే గ్రామాల్లో ఉన్న బీసీలు పట్టించుకుంటారా? అసలు ఎక్కడ ఉంది.. చంద్రబాబుకు సామాజిక వర్గాలపై ప్రేమ.. అసలు ఎక్కడ ఉంది.. పేద సామాజిక వర్గాల అభ్యున్నతిలో చంద్రబాబు మార్క్‌ అంటూ ఫైర్‌ అయ్యారు.