VIJAY : తమిళనాడు CMగా విజయ్ ప్రమాణస్వీకారం.. కానీ కొడుకు, కూతురు ఎక్కడ.?

Vijay

Vijay

దళపతి విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లో సంచలన విజయం సాధించి నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఆ పార్టీ నేతలు విజయ్ కు అభినందనలు తెలిపారు.

అయితే ఇంతటి చారిత్రాత్మక ఘట్టంలో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రి రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవుతున్న వేళ కొడుకుగా ఆయన పక్కన ఉండి అభినందనలు తెలుపుతారని అందరూ భావించారు. కానీ స్టేడియంలో కానీ ప్రమాణ స్వీకార వేదికపై కానీ జాసన్ జాడ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య మనస్పర్థలు రావడం, వీరిద్దరూ విడాకులకు అప్లై చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జాసన్ సంజయ్ తన తల్లి సంగీతకు అండగా ఉన్నాడు. ప్రస్తుతం సంగీత లండన్‌లో ఉంటుండగా కుమారుడు జాసన్ కూడా తల్లితోనే ఉంటున్నాడు. కేవలం ప్రమాణ స్వీకారమే కాకుండా ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించినప్పుడు కూడా జాసన్ సోషల్ మీడియా ద్వారా కనీసం అభినందనలు కూడా తెలపలేదు. కుటుంబపరమైన విబేధాల వల్లే ఆయన తండ్రికి దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే విజయ్ కూతురు కూడా కొంత కాలంగా తల్లి సంగీతతోనే ఉంటోంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా విజయ్ కొత్త బాధ్యతలు చేపడుతున్న తరుణంలో  విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.