NTV Telugu Site icon

Himachal CM: అసెంబ్లీ బైపోల్‌లో ముఖ్యమంత్రి భార్యకు సీటు

H Cm

H Cm

హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్‌కు అసెంబ్లీ సీటు దక్కింది. డెహ్రాలో జరగనున్న ఉప ఎన్నికల్లో కమలేష్ ఠాకూర్‌ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ప్రకటన రిలీజ్ చేసింది.

ఇది కూడా చదవండి: Vishwak Sen: శవాల మీద పేలాలు.. చెంబుతో బయలుదేరుతున్నారు.. రివ్యూయర్స్ పై విశ్వక్ ఫైర్

హిమాచల్‌ప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. హమీర్పూర్, నలగ, డెహ్రాలో జూలై 10న బైపోల్స్ జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడంతో ఉప ఎన్నికలు తటస్థించాయి.

ఇది కూడా చదవండి: Pakistan cricketer Haris Rauf: అభిమానిపై గొడ‌వ‌కు కాలు దువ్విన పాకిస్తాన్ క్రికెట‌ర్‌.. (వీడియో)

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల్లో జరిగాయి. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి మద్దతు లేకపోయినా రాజ్యసభ సీటు కైవసం చేసుకుంది. దీంతో అధికార కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో అనూహ్యంగా బీజేపీ రాజ్యసభ సీటును గెలుచుకుంది.