CM Siddaramaiah: బెంగళూరు తొక్కిసలాటపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Siddaramaiah: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ 2025 సీజన్ విజయం అనంతరం జరిగిన విజయోత్సవాల్లో చోటుచేసుకున్న విషాదకర తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని మేమే నిర్వహించలేదు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి, ట్రెజరర్ వచ్చి నన్ను ఆహ్వానించారు. గవర్నర్ కూడా వస్తున్నారన్న సమాచారం అందడంతోనే నేను వెళ్లాను. స్టేడియానికి నన్ను ఆహ్వానించలేదు.. కేవలం ఆహ్వానం మేరకే వెళ్ళానన్నారు.
Read Also: Breaking : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
విజయోత్సవ ర్యాలీ విధానసౌధ సమీపంలో ముగిసిన తర్వాత అక్కడ ఉన్న క్రికెటర్లను కలిసేందుకు సీఎం, ఇతర నేతలు హాజరయ్యారు. అయితే వీఐపీ హాజరు కారణంగా పోలీసు బలగాల ఫోర్స్ ను విభజించాల్సి వచ్చింది. సుమారు 5,000 మంది పోలీసుల బలగాన్ని ఈ ప్రాంతాల్లో విస్తరించడంతో స్టేడియంలో తగిన భద్రత ఏర్పాట్లు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో విపక్ష బీజేపీ పార్టీ కూడా మా ప్రభుత్వం పై తీవ్రంగా విమర్శలు చేసిందని అన్నారు. పోలీసు ఏర్పాట్లలో అలసత్వం కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు.
Read Also: Bharat Ram: తప్పులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..!
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నగర పోలీస్ కమిషనర్ సహా ముగ్గురు ఉన్నతాధికారులను బాధ్యతా రాహిత్యానికి గురయ్యారంటూ సస్పెండ్ చేసింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 47 మంది గాయాలపాలయ్యారు. ఐపీఎల్‌లో తొలిసారిగా ట్రోఫీ గెలుచుకున్న RCB ను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. కానీ, భారీ జనసందోహం విషాదానికి దారితీసింది.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..