పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ), ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని చెప్పారు. అసెంబ్లీ చివరిరోజు బీఅర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించినప్పుడు, ఆ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పీఏసీ పదవి కాంగ్రెస్ కు కాకుండా.. ఎంఐఎంకు ఇచ్చారని చెప్పారు.
Read Also: SC Sub Plan: ఎస్సీ సబ్ ప్లాన్ తీర్పుపై కమిటీ ఏర్పాటు..
అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే.. 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్ గా ఎలా ఉంటారు.? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎంకు ఎలా ఇచ్చారు.. ఇస్తారు..!? అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బ్రతకడానికి వచ్చినోళ్ళ ఓట్లు కావాలి కానీ, వాళ్లకు టికెట్లు ఇవ్వద్దా..!? అని అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని తెలిపారు. “బ్రతకడానికి వచ్చినోళ్ళు” అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం పై కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.