NTV Telugu Site icon

CM Revanth Reddy : కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష

Cm Revanth Reddy

Cm Revanth Reddy

కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్ గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు సీఎం రేవంత్‌.

Suicidal Behavior: ఆత్మహత్య చేసుకోబోయే వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? వారిని ఎలా కాపాడాలి?

అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని, పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ తెలిపారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నీక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Tirupati: సబ్‌ రిజిస్టర్ కార్యాలయంలో అటెండర్ దౌర్జన్యం.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరింపు