గతేడాది లెక్కల ప్రకారం.. దేశంలో సుమారు 1.64 లక్షల మంది వివిధ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 వీరిలో 1.10 లక్షల మంది పురుషులు కాగా 54 వేల మంది మహిళలు ఉన్నారు. ఇలాంటి వారిని ఇలా గుర్తించవచ్చో తెలుసుకుందాం. 

రోజువారీ పనుల్లో అశ్రద్ధ.. కారణం లేకుండానే ఏడవడం. 

 విపరీతంగా తినటం  లేదా అస్సలు తినకపోవటం.. అతినిద్ర లేదా నిద్రలేమి

 ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు. చీకట్లో ఉండేందుకు ప్రాధాన్యమిస్తారు.

కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా ఉంటారు.

 కారణం లేకుండా.. దూరంగా ఉన్నవారిని చూడాలనిపిస్తోందని అంటారు.

విపరీతమైన భావోద్వేగాలు చూపిస్తారు. బతకాలని లేదంటూ మాట్లాడుతుంటారు.

 ఒంటరిగా వదిలేయకూడదు. కిరోసిన్, పురుగు మందులు, తాడు వంటివి దూరంగా ఉంచాలి.

 ఎక్కువ సమయం ఒకే గదిలో ఉండకుండా చూడాలి. సాధ్యమైనంత త్వరా మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

 కుటుంబంలోని సభ్యులు ఎవరైనా ఈ పరిస్థితికి ఒక్కరోజులో రాలేరు. కాబట్టే వారిని గమనిస్తుండాలి.