Site icon NTV Telugu

Congress: “సర్పంచ్” ఫలితాలపై సీఎం రేవంత్ సమీక్ష.. 18 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్..

Cm

Cm

Congress: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్‌ను ఎందుకు బుజ్జగించలేదు.. సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని పీసీసీ తేల్చింది. దీంతో అగ్రనాయకులు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయ్యిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు రెండు, మూడు రోజులగా సమీక్ష జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

READ MORE: Sankranti Special Trains: గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వే శాఖ.. 600 ప్రత్యేక రైళ్లు

కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. డిసెంబర్ 18న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12,702 గ్రామ పంచాయతీల్లో మొత్తం 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా పోటీ చేశారన్నారు. 4221 సర్పంచ్ లను బీజేపీ బీఆర్ఎస్ కూటమి గెలుచుకుందన్నారు. 33 శాతం గెలుచుకున్నారని తెలిపారు. మా రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం రేవంత్ తెలిపారు. కంటోన్మెంట్.. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను ఆశీర్వదించారు. 94 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 87 నియోజక వర్గాల్లో మెజారిటీ సాధించిందని కొనియాడారు..

Exit mobile version