ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జిపైన అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
New Ration Cards: ‘మీసేవ’లో రేషన్ కార్డుల దరఖాస్తులు.. పౌరసరఫరాల శాఖ ఏం చెప్పిదంటే..?
చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. కాగా.. 2.425 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు మూడు ప్రతిపాదనలను చేశారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కొత్త ప్లైఓవర్ల పై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. అంతేకాకుండా.. రోడ్ల వెడల్పు పైన పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. రెండు రోజుల్లో సమగ్ర సమాచారంతో రావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
PM Modi: చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారు.. మోడీ ప్రశంసలు..