ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జిపైన అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.