Rythu Bandhu: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ వెల్లడించారు. గతంలో మాదిరిగా రైతులకు ఈ చెల్లింపులు చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Oath Ceremony: ఎల్లుండి విష్ణు దేవ్ సాయి ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
అయితే, రైతుబంధును ఆపాలని ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈసీని అనుమతి కోరగా, రైతుబంధు నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చింది. కానీ, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రైతు బంధు నిధులు విడుదల చేయొద్దని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో రైతుబంధు నిధులు విడుదల ఆగిపోయింది. ఇక, గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద 10 వేల రూపాయలు అందించింది. రెండు విడుతల్లో ఆర్థిక సాయాన్ని అందజేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రబీ సీజన్‌కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేయలేదు.. దీంతో ట్రెజరీలో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల నిధులను ఇప్పుడు విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.