NTV Telugu Site icon

CM Revanth: 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం సమావేశం.. ఎప్పుడు.. ఎందుకో తెలుసా..?

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ఇటీవల పదోన్నతి పొందిన 30 వేల మంది ఉపాధ్యాయులతో ఆగస్టు 2న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సమావేశ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు సాయంత్రం సంబంధిత ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Cold: వానాకాలంలో జలుబు తగ్గాలంటే ఇలా చేయండి

ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరిగిందని, ఈ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులందరితో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడేందుకు ఆగస్టు రెండవ తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మందికి రైన్ ప్రూఫ్ టెంటు సౌకర్యం కల్పించాలని, వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు తగు పార్కింగ్ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశ ప్రాంగణంలో కావలసిన మంచినీరు, పారిశుధ్యం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.

Chinmayi Sripada: నా భర్త అలాంటి వాడు.. ట్రోలర్స్‌కు చిన్మయి స్ట్రాంగ్ వార్నింగ్