Site icon NTV Telugu

CM Revanth Reddy: గ్రూప్ -1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రియాక్షన్..

High Court

High Court

CM Revanth Reddy: గ్రూప్ -1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా.. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని తెలిపారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిస్తున్నానని పేర్కొన్నారు.

READ MORE: CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ.. ఎవరిని వదిలేది లేదు..!

కాగా.. గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్ళీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సీజే బెంచ్.. ఇప్పటికే 562 మందికి తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. ఈ తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

READ MORE: Deputy CM Pawan Kalyan: వైసీపీపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్‌.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపారు..

Exit mobile version