Site icon NTV Telugu

CM Revanth Reddy : కాళోజి కళాక్షేత్రం భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేడు పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఆయన కాళోజి కళాక్షేత్రం భవనాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా.. కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కళాక్షేత్రంలోని గ్యాలరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇదేకాకుండా.. డిజిటల్‌ పద్ధతిలో వరంగల్‌లో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి.

Israel: ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేశాం.. పార్లమెంట్‌లో నెతన్యాహు ప్రకటన

కాసేపట్లో కాంగ్రెస్‌ ప్రజాపాలన విజయోత్సవ తొలి సభ ప్రారంభం కానుంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నిన్నటివరకు బిజీగా గడిపిన సీఎం, మంత్రులు అక్కడి కార్యక్రమాలు ముగించుకుని ఈ రోజు తెలంగాణకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు హాజరవుతున్నారు.

Black Coffee: బ్లాక్ కాఫీ ఈ వ్యాధులకు నివారణ మార్గం.. రోజూ తాగారంటే..?

Exit mobile version