Site icon NTV Telugu

CM Revanth: మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్‌.. ప్రాక్టీస్ తో చెమటోడుస్తున్న సీఎం సాబ్..!

Messi

Messi

CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయాలలో తిరుగులోని డెసిసిన్స్ తో ప్రతిపక్షాలను ఆడుకుంటున్న నేపధ్యంలో.. ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తో నిజమైన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. భారత పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ నెల డిసెంబర్ 13న హైదరాబాద్‌ నగరానికి విచ్చేయనున్నారు. అదే రోజున మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తరువాత డిసెంబర్ 13న సాయంత్రం ఉప్పల్ మైదానంలో లియోనెల్ మెస్సీ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ అంతర్జాతీయ దిగ్గజ ఆటగాడితో తలపడటానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు.

Local Body Elections: పంచాయతీ ఎన్నికల వేళ ‘వరాల జల్లులు’.. ఇంటికి రూ.5 లక్షల బీమా, పెళ్లికి పుస్తె మెట్టెలు ఇంకా ఎన్నో..!

ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీ (MCHRD) గ్రౌండ్స్‌లో ఆటగాళ్లతో కలిసి తీవ్రంగా సాధన చేస్తున్నారు. సీఎంవో (CMO) కార్యాలయం ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్ గురించి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.. “క్రీడా స్ఫూర్తి.. తెలంగాణ కీర్తి. ఈ నెల 13న ప్రపంచ ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీతో ఆడేందుకు ప్రాక్టీస్ ప్రారంభించాను. ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్‌ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగానని పేర్కొన్నారు. మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించడానికి, భేటీ అవ్వడానికి ఎదురుచూస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

IT Raids On Restaurants: ప్రముఖ హోటళ్లపై ఐటీ పంజా.. ఆర్థిక లావాదేవీలపై ఆరా..!

Exit mobile version