తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు భద్రాద్రి శ్రీ రాముని దర్శించుకోనున్నారు. భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో జరుగనున్న తిరుకల్యాణ మహోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ కల్యాణోత్సవం రాష్ట్రవ్యాప్తంగా భక్తులకి ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి స్వయంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఇది సంప్రదాయంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున నిర్వహించబడే కార్యక్రమాలలో భాగం.
READ MORE: RR vs PBKS : పంజాబ్ కు షాక్.. రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం..
తిరుకల్యాణం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాకకు వెళ్లనున్నారు. అక్కడ ప్రభుత్వ విధానాల ప్రకారం సన్నబియ్యం పొందుతున్న లబ్ధిదారుల ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేదల జీవన స్థితిగతులపై ప్రత్యక్ష అవగాహన పొందేందుకు ముఖ్యమంత్రి ఈ అడుగు వేస్తున్నారు.
READ MORE: Off The Record : మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ గులాబీ పార్టీకి తలనొప్పిగా మారారా