CM Revanth Reddy: రెండేళ్ల ప్రజాపాలనను.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లైంది.. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. మీట్ ది ప్రెస్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసింది.. కానీ.. రాష్ట్రం వచ్చాక ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించారన్నారు. 2004లో ఉచిత కరెంట్‌పై వైఎస్సాఆర్ మొట్టమొదటి సంతకం చేశారని గుర్తు చేశారు.. రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకుంది.. కరువు ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి జలయజ్ఞం చేపట్టారన్నారు.. కానీ, గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మార్చి నిధులు కొల్లగొట్టిందని ఆరోపించారు.. గతంలో నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కిన పరిస్థితులు ఉండేవన్నారు.
READ MORE: Kerala: పద్మనాభస్వామి ఆలయంలో బంగారం మాయం కేసు.. దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు..!
Also Read
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
“దున్నే వాడికి భూమి అనే నినాదం భుజాన వేసుకుని భూములు పంచింది కాంగ్రెస్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. “సినిమాలలో ఐటమ్ సాంగ్ ఉన్నట్టు కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్‌కి కేటీఆర్ ప్రచారానికి తేడా లేదు.. రెండేళ్ల మా పాలన పదేళ్ల వాళ్ళ పాలనకు పోల్చండి. మొత్తానికి 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాకు ఆప్పగించారు కేసీఆర్. తాడు తెగితే పాతాళంలో పడే పరిస్థితికి తెచ్చారు. కాళేశ్వరం లేకున్నా.. దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో ఉత్పత్తి లేదు. లక్ష 86 వేల కోట్లు సాగు నీటి కాంట్రాక్టర్స్ కి ఖర్చు చేశారు. కానీ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 27 వేల కోట్లు పాలమూరు ఎత్తిపోతలకు ఖర్చు చేశారు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఉస్మానియా ఆసుపత్రి కొత్తది కట్టలేదు.. కూలిపోతే పరిస్థితి వచ్చింది అన్నా.. పట్టించుకోలేదు.. ఏడాదిన్నరలో కమాండ్ కంట్రోల్ సెంటర్.. సెక్రటేరియట్.. కట్టుకున్నాడు.. కేటీఆర్ దశనే సక్కగా లేకుంటే.. దిశ ఎట్లా మారుస్తారు. సొంత చెల్లిని.. మాగంటి తల్లిని అవమాన పరిచిన ఆయన ఎలా మహిళలకు రక్షణగా ఉంటారు. సన్నబియ్యం రూ. 3 కోట్ల 10 లక్షలాది మందికి ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంచాం. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చాం. కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఆపలేదు. వాటిని కొనసాగించాం. మూసి ప్రక్షాళన చేస్తా అంటే.. కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. మూసి లో మునిగిపోతుంటే ఎందుకు వెళ్ళి అక్కడ పడుకోలేదు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?