NTV Telugu Site icon

Revanth Reddy: కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Fir Heat Courters

Revanth Reddy Fir Heat Courters

CM Revanth Reddy Speech in Adilabad: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే తమ విధానం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నానన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అని, అభివృద్ధి విషయంలో మాత్రం కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధానికి సీఎం స్వాగతం పలికి.. శాలువాతో సత్కరించారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం మాట్లాడారు.

‘అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలుకుతున్నాం. విభజన హామీ మేరకు ఎన్‌టీపీసీ 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వం ధోరణితో కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తాం. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో వెలుగులు నిండనున్నాయి. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే కానీ అభివృద్ధి విషయంలో కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదు.. సహృద్భావ వాతావరణం ఉండాలి. అందుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: PM Modi: మోడీకి కుటుంబం లేదు.. నా జీవితం మీ సేవకే అంకితం: ప్రధాని మోడీ

‘స్కై వేల ఏర్పాటు, టెక్స్ టైల్స్ ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పనందించినందుకు కృతజ్ఞతలు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి పట్ల మా ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుంది. హైదరాబాద్ మెట్రో, మూసీ నదీ పరివాహక అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరుతున్నా. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదు. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే మా విధానం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధానిని కోరుతున్నా’ అని సీఎం పేర్కొన్నారు.