NTV Telugu Site icon

CM Revanth Reddy: అదానీ పెట్టుబడుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేం..

Cm

Cm

అదానీ పెట్టుబడులను వెంటనే రద్దు చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేసే పరిస్థితి ఉండదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయని సీఎం పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే రాజ్యాంగాన్ని మారుస్తున్నామని అన్నారు. ప్రైవేటు సంస్థల పెట్టుబడులపై విస్తృతంగా చర్చ జరగాలి.. వ్యక్తుల మీద చర్చ కాదని సీఎం తెలిపారు.

Bihar: మగ టీచర్‌కు మెటర్నిటీ లీవ్ మంజూరు.. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు

రవీంద్రభారతిలో “NUTS BOLTS OF WAR & PEACE” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరోవైపు.. మణిపూర్‌లో రెండు జాతుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది.. మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధానికి అక్కడ సరఫరా అవుతున్న అత్యాధునిక ఏకే 47 కారణం అని సీఎం ఆరోపించారు. అక్కడున్న సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు అంతర్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఇలాంటి వాటిపై పార్లమెంటులో చర్చ జరగడం లేదని సీఎం తెలిపారు. చైనా దురాక్రమణ, మణిపూర్‌లో పేలుతున్న ఏకే 47 లపై విస్తృత చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..

Show comments