Site icon NTV Telugu

CM Revanth Reddy: రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు.. సీఎం రేవంత్ కసరత్తు..

Cm Revanth Reddy Cm

Cm Revanth Reddy Cm

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు నమూనాలను పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చారు. టీఎస్ స్థానంలో టీజీని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read also: MLC By Election: కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ పోలింగ్.. 12 గంటల వరకు 33.19 శాతం

ఈ నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్త సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర అధికారిక కమ్యూనికేషన్‌లు కూడా టీఎస్‌కు బదులుగా తెలంగాణ కోడ్‌ను టీజీగా ఉపయోగిస్తున్నాయి. లెటర్‌హెడ్‌ల నివేదికలు, నోటిఫికేషన్‌లు, అధికారిక వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ బయోస్ మరియు ఇతర అధికారిక వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్ బయోస్‌లో TGగా మార్చబడ్డాయి. అయితే రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చవద్దని పలువురు రాజకీయ నేతలు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా రేవంత్‌ మొగ్గు చూపారు.
NVSS Prabhakar: ధాన్యం కొనుగోలు అవినీతిపై సీఎం ఎందుకు స్పందించడం లేదు..

Exit mobile version