NTV Telugu Site icon

Revanth Reddy: నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

Revanth

Revanth

Indravelli Sabha: ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. రూ.500​​కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. మూడు పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Read Also: Astrology: ఫిబ్రవరి 2, శుక్రవారం దినఫలాలు

అయితే, ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్‌రెడ్డి సెంటిమెంట్‌గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట నిర్వహించిన సభకు లక్ష మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో రేవంత్‌ రెడ్డి ఇక వెనుదిరిగి చూసుకోలేదు.. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్‌ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక, దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్‌రెడ్డిగా సీఎం కావడం జరిగిపోయింది. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

Read Also: Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

ఇక, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీజేపీ, రెండు బీఆర్‌ఎస్‌ గెలువగా, ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా మాత్రం గెలిచారు. అయినప్పటికీ సీఎం రేవంత్‌ రెడ్డి ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ నుంచే సవాల్‌గా తీసుకొని సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారబోతుంది. కాగా, ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్‌ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ సమరశంఖం పూరించనుంది.