NTV Telugu Site icon

CM Revanth Reddy : చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకొచ్చారు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ స్పూర్తితో ఇందిరాగాంధీ భూసంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ధరణి పేరుతో పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేశారునరి ఆయన ఆరోపించారు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. భూమి పేదవాడి ఆత్మగౌరవం.. అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారని ఉద్ఘాటించారు. ధరణి ముసుగులో కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

DCP Srinivas : అంతరాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు