CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
- ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక
- చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం
- పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎ రేవంత్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అధికారులు ఇసుక రీచ్ ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని, హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్సెమెంట్ నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతీ ఇసుక రీచ్ ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
BYD Sealion- 7 Electric SUV: ఫిబ్రవరి 17న మార్కెట్లోకి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 567 కి.మీ రేంజ్
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App Update: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా..ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ లు ఏర్పాటు చేయాలని సూచన.. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలి.. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి.. ఏరియాలవారీగా సమీప ఇసుక రీచ్ ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా సిస్టం ఉండాలి.. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలి.. సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలి.. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలి.. ఆన్ లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులను చేయాలి. ఆఫీస్ టైమింగ్స్ లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలని, అక్రమరవాణాకు సహకరించే అధికారులపై వేటుతప్పదు. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తాం. పారదర్శకంగా అక్రమాలకు తావులేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Bird Flu: తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్ తినొద్దని అధికారుల హెచ్చరిక
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!