ఖైరతాబాద్ మహా గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు అర్చకులు.. సీఎం రేవంత్ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు.. దేశంలోనే గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.. ఖైరతాబాద్ గణేశుని కి ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది.. 1 లక్ష నలభై వేల విగ్రహాలు ఈ సారి నగరంలో ప్రతిష్టించారు..
Also Read:#SSMB29 : 120 దేశాల్లో విడుదలకు ప్లాన్.. రాజమౌళి కొత్త రికార్డు
గణేష్ మండపం నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము.. గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారుల సేవలు మరచి పోలేము.. ప్రజలందరికి మనవి ప్రశాంతంగా గణేష్ ముగింపు ఉత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నాను.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తెలంగాణ రాష్టానికి పేరు తీసుకొచ్చింది.. నేను టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఖైరతాబాద్ గణేశున్ని దర్శించుకున్నాను.. ప్రజలందరు సంతోషంగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థించాను అని తెలిపారు.
