Site icon NTV Telugu

CM Revanth Reddy : ఆ స్థానాల్లో నిర్లక్ష్యం వహించవద్దు..

Revanth Reddy

Revanth Reddy

నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండవద్దన్నారు.

కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే ఈవీఎంల లెక్కింపు అవుతుందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా పంపించాలని… సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకువెళ్లేలా చూడాలన్నారు. కౌంటింగ్ సమయంలో ప్రతి రౌండ్‌లోనూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అభ్యర్థులందరికీ వీటన్నింటిపై అవగాహన ఉండాలన్నారు.

Exit mobile version