CM Revanth Reddy: 60 వేల పైచిలుకు ఉద్యోగాలు.. 20 వేల నియామక నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. తాజాగా నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో సీఎం ప్రసంగించారు. తలకాయలో గుజ్జు ఉన్న వారు.. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం పైశాచిక ఆనందం.. వెకిలి చేష్టలు ఎక్కువ అయ్యాయి.. అంత అసహనం ఎందుకు? అని ప్రశ్నించారు. “ఎవరిది డ్రగ్స్ కల్చర్.. ఇవాళ గల్లి గల్లి డ్రగ్స్.. గంజాయి దందాలు ఉన్నాయి. ఎవరు సినీ కార్మికులతో ఉన్నారు.. సినీ తారలతో చర్చల్లో ఉన్నది ఎవరో ఆలోచించండి.. గ్రేటర్ లో నాకు ప్రతినిధులు లేరు.. ఓల్డ్ సిటీలో సహకరించే వారికి అభివృద్ధి నిధులు ఇస్తున్న.. కంటోన్మెంట్ లో మేము గెలిచిన.. నిధులు అభివృద్ధి జరుగుతుంది.. BRS MLAలు ఇప్పటి వరకు సమస్యలపై నా దగ్గరికి రాలేదు.. మేము పోవాలి అంటే.. ప్రోటోకాల్ మాది.. మీరెందుకు వస్తున్నారు అంటున్నారు.. BRS గెలిచిన వాళ్ళే సభకు రావడం లేదు.. జూబ్లిహిల్స్ లో గెలిచి ఏం చేస్తారు.. పదేళ్లు మేము అధికారంలో ఉంటాం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం డ్రగ్స్, చెరువుల ఆక్రమణలు తొలగిస్తాం..” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
READ MORE: Bollywood : రూట్ మార్చిన బాలీవుడ్.. వార్ సినిమాలపైనే ఫోకస్.. కారణం ఏంటి?
కమిషన్‌లు తమపై తప్పుడు ఆరోపణలు చేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారన్నారు. కిషన్‌రెడ్డి సీబీఐకి ఇవ్వండని అడిగారు.. అసెంబ్లీ లో సీబీఐకి ఇచ్చామన్నారు. కానీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదన్నారు. ఎందుకు అనేది.. ఆపుతుంది ఎవరు అనేది మీడియా తేల్చాలన్నారు. అనంతరం కాలేజీల అంశంపై మాట్లాడారు. కళాశాలలు కేసీఆర్ న్నప్పుడు బకాయిలు అడగలేదన్నారు. “నన్ను బెదిరించడానికి బంద్ పెట్టారు.. కాలేజీ బంద్ చేస్తే.. పిల్లల చదువుల లాస్ కి జవాబుదారీ ఎవరు..? బంద్ లు.. బందూక్ పెడితే సమస్య పరిష్కారం కాదు.. రూల్ బుక్ ఫాలో అవుదాం అంటే పోదాం.. పిల్లలు ఫీజులు కట్టుకుని వెళ్లిపోయాక.. వాళ్ళ డబ్బులు కూడా యాజమాన్యం తీసుకుంటుంది.. టీచింగ్ స్టాండర్డ్ ఏంటో చూద్దాం.. తలతాకట్టు పెట్టీ అయినా.. వెంటనే డబ్బులు ఇస్తా..” అని సీఎం వెల్లడించారు.
