CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను మరోసారి స్మరించుకున్నారు. నెహ్రూ ఆకస్మిక మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యత సమయంలో కాంగ్రెస్ నేతల అభ్యర్థనపై ఇందిరా గాంధీ బాధ్యతలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిందని సీఎం పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆమె పనిచేసి బ్యాంకుల జాతీయీకరణ, పేదలకు గృహాలు, పరిపాలనలో ప్రక్షాళన వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇందిరమ్మ నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని గుర్తుచేశారు. పాకిస్తాన్ సైన్యాన్ని తలవంచేలా చేసి, బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో చరిత్ర సృష్టించడం కూడా ఇందిరా గాంధీతోనే సాధ్యమైందని అన్నారు.
Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత చిత్రం – రామ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్
మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను సీఎం వివరించారు. సౌర విద్యుత్ ప్లాంట్లు పూర్తిగా మహిళలకు కేటాయించడం, ఇందిరమ్మ ఇండ్లలో మహిళలకు ప్రాధాన్యం, RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే కాకుండా మహిళలను RTC బస్సుల యజమానులుగా ఎదిగే అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు తమ ప్రభుత్వ ప్రత్యేకత అని చెప్పారు. సీతక్క, సురేఖ వంటి నేతలు మంత్రులుగా ఎదగడం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఆశీస్సుల వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు.
November 19: నవంబర్ 19.. భారత క్రికెట్ చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం..!
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్.. ఒకప్పుడు పంచిన చీరలు పొలాల్లో కట్టే స్థాయిలో ఉండేవని, కానీ తమ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే సారే ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రారంభమైందని, మొత్తం కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించనున్నట్లు తెలిపారు. ఇంకా 35 లక్షల చీరలు రానున్నాయని, అర్హులైన ప్రతీ మహిళకు చీర చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మొదటి దశలో డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుందని, రెండో దశలో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.
