CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం రూ.12,062 కోట్ల విలువైన పెట్టుబడులు, దాదాపు 30,500 ఉద్యోగాలు ఈ పర్యటన ద్వారా సాధ్యమయ్యాయి.
ముఖ్య ఒప్పందాలు – కీలక వివరాలు:
మారుబెని కంపెనీ : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మారుబెని కంపెనీతో ఒప్పందం కుదిరింది.
ప్రారంభ పెట్టుబడి: ₹1,000 కోట్లు
మొత్తం అంచనా పెట్టుబడి: ₹5,000 కోట్లు
ఉద్యోగాలు: 30,000
NTT డేటా, నెయిసా : హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం.
పెట్టుబడి: ₹10,500 కోట్లు
తోషిబా ట్రాన్స్ మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (TTDI) : రుద్రారంలో విద్యుత్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం.
పెట్టుబడి: ₹562 కోట్లు
TOMCOM-Turn-Raj Group ఒప్పందం : జపాన్‌లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్‌కామ్, టెర్న్, రాజ్ గ్రూప్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
జపాన్ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రేపు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత, నేరుగా సంగారెడ్డికి వెళ్లనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో సీఎం హాజరుకానున్నారు.
Pahalgam terror attack: ఆర్మీ యూనిఫాంలో టెర్రరిస్టులు.. “ముస్లిం” కాదని కాల్పులు..
