ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 8:30 గంటలకు గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు. 9.20 గంటలకి పరేడ్ గ్రౌండ్ చేరుకొని సైనికుల స్మారకానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వాతంత్య్ర వేడుక సంబురాల్లో పాల్గొని.. అనంతరం పలువురికి సేవా, పురస్కార పథకాలు అందజేస్తారు. గోల్కొండ కోట జెండా వందనం కార్యక్రమం అనంతరం.. ఉదయం 11.45 గంటలకు బేగం పేట విమానాశ్రయం నుండి భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు బయలుదేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12:50 గంటలకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చేరుకుంటారు. పుసుగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ,అనంతరం పంప్ హౌజ్ స్విచ్ ఆన్ చేసి..అక్కడే మీడియాతో మాట్లాడతారు. అనంతరం ఖమ్మం జిల్లా వైరా చేసుకొని…మూడో విడత 2లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీ ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
CM Revanth Reddy : ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్..

Cm Revanth Reddy