NTV Telugu Site icon

CM Revanth Reddy : మతాలకు అతీతంగా దేశ ప్రతిష్ఠను పెంపొందించేవి క్రీడా మైదానాలే

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నారని అన్నారని.. ఇది బాధ కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఒలింపిక్స్‌లో భారత్ స్థితిపై యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపించారు సీఎం రేవంత్‌. రానున్న కాలంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీలు ప్రారంభించి క్రీడాకారులకు సమర్థమైన శిక్షణ అందించాలని అన్నారు. చదువు , క్రీడల్లో ప్రగతి సాధించాలని యువతకు సూచించారు. క్రీడాకారులే దేశ ప్రతిష్ఠను పెంచుతారని ఆయన గుర్తించారు.

Viral Video: ట్రాఫిక్ జామ్‌లో చిక్కుక్కున్న అమ్మాయి.. ఏం చేసిందో చూడండి

హైదరాబాద్‌లో 40 సంవత్సరాల క్రితం జరిగిన ఏషియన్ గేమ్స్‌కు అనుబంధంగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలను పట్టించుకోలేక పోయామని విమర్శించారు. యువత డ్రగ్స్ , గంజాయి వంటి వ్యాధులను ఆసక్తిగా చూస్తున్నందుకు తీవ్రంగా దుఃఖిస్తున్నట్టు తెలిపారు. నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడం, అలాగే క్రికెటర్ సిరాజ్‌కు ఉద్యోగం ఇస్తూ ఆర్థికంగా సహాయం చేయడం వంటి చర్యలను పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌ను క్రీడా కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. క్రీడామైదానం కులం, మతం బేధం లేకుండా అందరి కలసి ఉండే ప్రదేశం అని ఆయన అభిప్రాయపడ్డారు.

Duddilla Sridhar Babu : 2017లో వచ్చిన జీవో ఇప్పుడు అమలు చేస్తున్నాం

“నిఖత్ జరీన్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇండియాకు బాక్సింగ్‌లో తలమానికంగా మారారు. నిఖత్ జరీన్‌కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చాం.. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనం.. నిబంధనలు సడలించి మహ్మద్ సిరాజ్‌కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చాం.. పీవీ సింధు, అజారుద్దీన్ లాంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు.. పుట్‌బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గర్వకారణం.. హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలని అండర్ 17 పుట్‌బాల్ నేషనల్ టీమ్‌ను తెలంగాణ దత్తత తీసుకుంటోంది..’ అని ఆయన వ్యాఖ్యానించారు.