NTV Telugu Site icon

CM Revanth Reddy: పకడ్బందీగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ..

Revanth 1

Revanth 1

త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా.. ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.

Read Also: Big Breaking: టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం..

డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యాశాఖ పై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి, విద్యాశాఖ కమీషనర్ దేవసేన ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Read Also: IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు రేపటికి వాయిదా..

అంతేకాకుండా.. రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదికతో పాటు.. రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో, వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని సీఎం స్పష్టం చేశారు.