Site icon NTV Telugu

CM Revanth Reddy : మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటాం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారని, మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేసామని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా దామోదర రాజనర్సింహ గారి నేతృత్వంలో న్యాయవాదులను నియమించామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదు…ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించిందని, సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా మేం స్పష్టంగా ప్రకటించామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. తెలంగాణ సమస్యలా ఈ సమస్య జఠిలం అయిందని, కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. మీ వాదనలో బలం ఉంది.. మీకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉందని, న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం వేసామని సీఎ రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Bhatti Vikramarka: డైట్ చార్జీల పెంపు చారిత్రాత్మక మైన రోజు

అంతేకాకుండా..’ 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ ను కూడా నియమించాం.. మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.. సీఎం పేషీలో మాదిగలు ఉండాలని డా.సంగీత గారిని నియమించుకున్నాం. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించాం. IIT వీసీగా, విద్యా కమిషన్ మెబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాం. పగిడి పాటి దేవయ్య గారిని స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్ గా నియమించుకున్నాం.. అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం.. ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదు.. న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం.. అమలుచేయడంలో కొంత ఆలస్యం కావచ్చు… కానీ మీకు తప్పక న్యాయం చేస్తాం.. నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉంది.. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత నాది…’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

PAK: మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం.. కోహ్లీని వెనక్కి నెట్టి

Exit mobile version