NTV Telugu Site icon

CM Revanth Reddy : కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం… నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం

Budget

Budget

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కేంద్ర బడ్జెట్‌పై తీర్మానం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని, గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని, మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీ వెళ్లామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రస్తావించామి, పెద్దన్న పాత్ర పోషించాలని మోడీని కోరానన్నారు. మోడీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేది ఏముంది.? రాష్ట్రాలకు పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరానని, ఎవరి దగ్గర వంగిపోవడమో, లొంగిపోవడమో చేయలేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy : ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దాం

అంతేకాకుండా.. ‘తెలంగాణపై వివక్ష కాదు, కచ్చితంగా కక్ష. కొందరు త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసింది కాంగ్రెస్‌ కాదా.? పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే 45 పైసలు కూడా తిరిగి ఇస్తలేదు. అదే బీహార్‌ రూపాయి చెల్లిస్తే, కేంద్రం తిరిగి రూ.7 ఇస్తోంది. గుజరాత్‌లో మోడీ తన ఎస్టేట్‌లు అమ్మి మనకు ఏమైనా ఇచ్చారా.? తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి వచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే. ఐదు దక్షిణాది రాష్ట్రాలు రూ. 22.66 లక్షల కోట్ల పన్ను చెల్లించాయి. పదేళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.6లక్షల కోట్లు. యూపీ రూ.3.47లక్షల కోట్లు పన్ను చెల్లిస్తే, అక్కడ కేంద్రం రూ.6.91 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుంది. ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. పార్లమెంట్‌లో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి.’ అని సీఎం రేవంత్‌ రెడ్డిఅన్నారు.

India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత్‌ ర్యాంక్ ఇంత దారుణమా.?
అయితే.. తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్‌ తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు. రేపు తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.