NTV Telugu Site icon

Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్..ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ

Rathubarosa

Rathubarosa

తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దఫాలో రూ.లక్ష వరకు రుణం పొందిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వేదికగా వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా బటర్ నొక్కి నిధులను విడుదల చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీపై మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.లక్ష లోపు బ్యాంకులకు బాకీ పడిన రైతులు 11,08,171 లక్షల మంది ఉండగా.. ప్రభుత్వం మొదటి దఫాలో రూ. 6,098 వేల కోట్లను విడుదల చేసింది.

READ MORE: DK Shivakumar: బెంగళూరులో జనాభా కోటి దాటారు.. ప్రైవేట్ ఉద్యోగాల కోటాపై కీలక వ్యాఖ్యలు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ బ్రాంచీలో ఏం సమస్య వచ్చిన అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.. మూడు దశల్లో రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడత రుణమాఫీకి రూ.8వేల కోట్లు అవసరమని అంచనా. రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు ఉన్న రైతు రుణాలను ఆగస్టు 15లోపు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడో విడత రుణమాఫీకి రూ. 15వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.