NTV Telugu Site icon

Delhi Tour: రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

Revanth Reddy

Revanth Reddy

రేపు ఢిల్లీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్‌మెంట్‌ ఖరారు కావడంతో రేపు సాయంత్రం 4. 30 గంటలకు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చర్చించే అవకాశం ఉంది. అయితే, రేపు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలవనున్నారు. ప్రధానంగా పార్లమెంట్‌ ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి నాగ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం, డిప్యూటీ సీఎంలు పాల్గొననున్నారు.

Read Also: Guntur Kaaram: స్పైసీ సాంగ్.. మహేష్, శ్రీలీల చితక్కొట్టేశారు అంతే!

అయితే, తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన విషయంపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించనున్నారు. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆరు ఎమ్మెల్సీ పోస్టులకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. వీటన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రేపటి ఢిల్లీ పర్యటనతో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

Show comments